AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై చర్చ!
- నేడు ఏపీ కేబినెట్ సమావేశం..
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ, ఆమోదం..
- కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలపనున్న కేబినెట్..
- కేబినెట్ భేటీ తర్వాత తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: సచివాలయంలో ఇవాళ (ఆగస్టు 6న) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే, నాలా చట్ట సవరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ భూమిని వ్యవసయేతర అవసరాల కోసం ఉపయోగించేందుకు నాలా చట్ట సవరణ చేయనున్నారు. ఎల్ఆర్ఎస్ పై కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఇక, కొత్త బార్ పాలసీపై ఏపీ కేబినెట్ లో చర్చ జరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ, ఫీజులు పెంచే విషయంలో మంత్ర వర్గం నిర్ణయం తీసుకోనుంది.
Read Also: Kishkindhapuri : ‘కిష్కింధపురి’ నుండి సాలిడ్ అప్డేట్.!
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
అలాగే, సీఎం అండ్ టీం సింగపూర్ టూర్ పై కేబినెట్ లో చర్చ జరగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు వివిధ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. లిక్కర్ స్కాంలో నగదు బయట పడడం, ఇప్పటికే జరిగిన అరెస్టులకు సంబంధించి మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇక, కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!