అందరిదీ ఒకే పార్టీ…. అంతా అధికారంలోనే ఉన్నారు. అయినా సరే… ఎవరికీ ఎవరితో పడటం లేదా? ఆ ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారా? లోపం ఎక్కడుంది? ఎందుకు మొదలైందా సమస్య? మరీ ఘోరంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థి ఎందుకు వచ్చింది? ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలే వేరప్పా….అక్కడ ఎవరి మాటా ఎవరూ వినరప్పా…ఎవరికి వారే రాజులు, రారాజులు. ఇదీ జిల్లాలో సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా… కొందరు పెద్ద నాయకుల…
మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త..! రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న రెండు…
వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలు ఔట్! వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం…
వైష్ణవి హత్య కేసులో వీడని సస్పెన్స్: కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. విద్యార్థిని హత్యపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం (జులై 14) ఉదయం 8.30 గంటలకు గండికోటకు చేరుకున్న వైష్ణవి, లోకేశ్.. 10:40 గంటలకు లోకేశ్ ఒక్కడే తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హత్య…
నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్.. ఉదయం 11 గంటలకు రైతు సమస్యలు, అక్రమ అరెస్టులు, పర్యటనలపై ఆంక్షలు వంటి వాటిపై జగన్ మాట్లాడే అవకాశం ఈరోజు సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ప్రక్రియ.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఉప ఎన్నిక ప్రక్రియ.. ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో వైసీపీ ఎంపీటీసీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో పర్యటించనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది.. 5 కోట్ల రూపాయల నిధులతో పలు…
ఐపీఎల్ తరహాలో ఆసక్తిగా ఏపీఎల్ 2025 వేలం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. ఏపీఎల్ సీజన్ 4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేరు నమోదు చేసుకుకోగా.. ఏడు జట్ల యాజమాన్యం ప్లేయర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. వేలంలో ఇప్పటివరకు పైలా అవినాష్‌కు భారీ ధర దక్కింది. రూ.11.5…
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు…
ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు నేడు కాకినాడకి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ.. రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థినులతో మాట్లాడనున్న శైలజ.. నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణలు చేసిన 50 మంది విద్యార్థినులు ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30…
బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్! అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా…