ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరణ.. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కుట్రకు సంబంధించి యాక్టివిస్టులు, జేఎన్‌యూ మాజీ విద్యార్థులు అయిన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లో పాటు మరో ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, షాలిందర్ కౌర్‌తో కూడిన ధర్మాసనం ఈ ఇద్దరితో పాటు మొహమ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహమాన్, అథర్ ఖాన్, మీరాన్ హైదర్, షాదాబ్ అహ్మద్ అబ్దుల్…
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో…
ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మా స్టార్ బ్యాట్స్‌మన్ నువ్వే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చెప్పగా, వెంటనే స్పందించిన కోమటిరెడ్డి, “మా కెప్టెన్ నువ్వే” అంటూ ఉత్తమ్‌ను…
కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 ఎంఓయూలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందంజరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10వేల…
పాక్ కు గూఢచర్యం.. డీఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ కాంట్రాక్ట్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్‌ను అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI కోసం గూఢచర్యం చేయడం, దేశ రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు పంపడం వంటి ఆరోపణలపై రాజస్థాన్ CID ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది. మహేంద్ర ప్రసాద్‌ను ఆగస్టు 13 బుధవారం కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి…
AP Cabinet Meeting: సచివాలయంలో ఇవాళ (ఆగస్టు 6న) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ను జైలుకు పంపాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొంత మంది వివాహేతర సంబంధాల కోసం హత్యలకు తెగబడుతుంటే.. ఇంకొందరు కుటుంబ కలహాలతో జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్నారు.