ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. నెల్లూరు పాలెంలోని గిరిజన కాలనీలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించనున్నారు.
విశాఖలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే సింహాచలం అప్పన్న సన్నిధిలో భారీగా భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ దిగువున బస్సులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సింహాచలంలో గోడ కూలి క్యూలైన్లో ఉన్న భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
బెయిల్‌పై విడుదలైన గోరంట్ల మాధవ్: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ �
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ.. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర
హోమ్ గార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై ఏపీ సీఐడీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సీఐడీ విభాగంలో 28 హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్�
నీటి కుంటలో మునిగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. మొలకలచెరువు మండల కేంద్రానికి చెందిన మల్లేష్ (36), అతని కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిషోర్ (10) కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు వెళ్లి చెరువ
ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ నేడు కూడా వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను విచారించనున్న పోలీసులు.. చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నం ఘటనపై మాధవ్‌ను విచారించనున్న పోలీసులు లిక్కర్ స్కాంలో ఇవాళ కూడా అరెస్టులు జరిగే ఛాన్స్.. ఇప్పటి�