ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రూ.8.20 కోట్ల రూపాయలు తరలించినట్టు బాలాజీపై ఆరోపణలు ఉండగా.. ఇండోర్ లో బాలాజీని అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది.. లిక్కర్ స్కాం కేసులో నిందితుల విదేశీ పర్యటనలపై సిట్ ఫోకస్ పెట్టింది. స్కాంలో ముడుపులకు సంబంధించి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా వేర్వేరు దేశాలు కూడా హవాలా మార్గంలో మళ్లించారని ఇప్పటికే అనుమానిస్తున్న నేపథ్యంలో నిందితుల విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను సిట్ సేకరిస్తోంది..
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది సిట్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుల అరెస్టులపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగతా నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు.. ఏపీలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చే ముందు.. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ఈ సందర్భంగా నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు.. ఇది మంచి పద్దతి కాదు.. నాకు నోటీసు…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఇప్పుడు నిందితుల సంఖ్య 39కి చేరింది.. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరును FIRలో చేర్చింది సిట్.. A 38గా చేవిరెడ్డి పేరును పేర్కొంది.. ఈ మేరకు కోర్టులో మెమో వేశారు సిట్ అధికారులు.. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ను ఈ కేసులో A 34గా చేర్చింది..
తాజా పరిణామాలపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాం కేసులో కీలక విషయాలు వెల్లడించింది.. బలవంతంగా వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారని.. వినకపోతే దాడి చేస్తున్నారన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖపై క్లారిటీ ఇస్తూ.. మద్యం స్కాం కేసులో ముడుపులు ఏ1 రాజ్ కేసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరాయి.. గత ఎన్నికలలో ప్రజలకు ఈ డబ్బు చెవిరెడ్డి పంచినట్టు తెలిసింది.. విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్‌మెన్‌గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్…
లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు... ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి నరకం చూపిస్తూన్నారట.. కాళ్లు, చేతులో కట్టేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వేధించి చెవిరెడ్డి పేరు చెప్పించాలని…
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తోంది సిట్. ఈ కేసులో నలుగురు నిందితులు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఒకే సారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేసింది సిట్. ఈ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్.. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపాలని వైఎస్ జగన్ సవాల్ చేశారు.. దీనిపై ఏమీ సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు చేతులు ఎత్తేశారని సెటైర్లు వేశారు..