ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సిట్ టీమ్ ముంబై వెళ్లింది.. షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్ హౌస్‌లో సిట్ దాడులు చేసి రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్, ముందస్తు బెయిల్ పిటిషన్లు రెండు ఒకేసారి నిందితులు దాఖలు చేయటం చర్చగా మారింది. 2 పిటిషన్లు దాఖలు చేశారు నిందితులు కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్.
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇప్పటికే కీలక నేతల అరెస్ట్ వ్యవహారం కాకరేపుతుండగా.. తాజాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల అరెస్ట్ కోసం వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది సిట్.. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేయటం కోసం అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు..
లిక్కర్ అమ్మకానికి చంద్రబాబే రాచమార్గం వేశారని ఆరోపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యక్తులతో మద్యం అమ్మకాలు.. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు చేస్తూ.. లిక్కర్ అమ్మకాలకు రాచమార్గం వేసిందే చంద్రబాబు అని విమర్శించారు.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది.
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసుకు సంబంధించి ప్రైమరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఒకవైపున కసరత్తులు చేస్తున్న అధికారులు.. మరోవైపున సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను కూడా అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ 11 మందిని అరెస్టు చేసింది..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ముందు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోనే ఉంది.. తాజా నోటీసుల ప్రకారం.. సిట్ ముందు నేడు విజయసాయిరెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం కారణంగా ఇవాళ విచారణకు రాలేనని విజయసాయి రెడ్డి సిట్ అధికారులకు తెలిపారు.
ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్‌కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది.