ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోన్న లిక్కర్ స్కాం కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.. రాష్ట్ర పరిస్థితి, లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న ఆయన.. వైఎస్ జగన్ గత ఐదేళ్లలో చేసిన అప్పులు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.. అయినా, బీజేపీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు…
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్ట్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. మద్యం కుంభకోణంలో కేసులో A 31 ధనుంజయ రెడ్డి, A 32 కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం రోజు అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సిట్ అధికారులు.. సుమారు మూడు గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగాయి..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసశారు సిట్ అధికారులు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు సిట్ అధికారులు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డినీ విచారించనున్నారు సిట్ అధికారులు. జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డిని తీసుకు వచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో ఏ6గా శ్రీధర్ రెడ్డి ఉన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి రెండో…
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు.
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ జోరు పెంచింది. ఈ కేసులో అరెస్టైన ఏ1 కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏ8 చాణక్య ఆస్తుల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. 2019-2024 సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీని సిట్ కోరింది.
ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అరెస్టుల పరంపర కొనసాగిస్తుంది.. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ8 చాణక్యను అరెస్టు చేసిన సిట్.. తాజాగా, ఏ6 శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసింది. దీంతో ఇకపై వరుసగా కేసులో అరెస్టులు ఉంటాయనే సంకేతాలు సిట్ ఇచ్చింది.. గత రెండు నెలలుగా లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సిట్.. ఇప్పుడు ఆ కేసులో అరెస్టులపై ఫోకస్ పెట్టింది.