సిట్ విచారణలో సంచలనం విషయాలు బయటపెట్టారట నారాయణస్వామి.. ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారులను నియమించడంలో నా పాత్ర ఏమీ లేదన్నారు.. నాకు లిక్కర్ కేసుకు సంబంధం లేదన్న ఆయన.. సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు.. నా మాట అక్కడ వినే వారు ఎవరంటూ చెప్పుకొచ్చారట నారాయణస్వామి.. నా మాటలను అక్కడ ఏ అధికారి వినలేదన్న ఆయన.. సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను ముందుపెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలారట.. నారాయణస్వామి నుంచి మరిన్ని కీలకమైన విషయాలు రాబట్టిందట…
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏ31 రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి.
లిక్కర్ కుంభకోణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్ట్ ఖాయమని అంటున్నారు బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ చెప్పలేమని చెబుతున్నారు. బిగ్ బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు. అప్పట్లో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, 53 రోజులు జైల్లో ఉంచినా ఆధారాలు చూపలేకపోయారని మండిపడ్డారు.. మద్యం స్కామ్ లో సిట్ ఆధారాలు సేకరించి అరెస్టులు చేస్తుందని వివరించారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఓవైపు విచారణలు.. మరోవైపు.. కోర్టులో పిటిషన్లు.. ఇంకో వైపు.. పిటిషన్లపై విచారణ ఇలా.. ఈ రోజు కీలకంగా మారింది..
కేబినెట్‌లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రుల తో ప్రస్తావించారు.. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, లిక్కర్ కేసు విషయంలో మంత్రులు ఆచి తూచి స్పందించాలన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి.. ఇక, ఈ నెల 12వ తేదీన మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు..
ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు.. ఏం ఆధారాలు లేకుండా ఎంపీని అరెస్టు చేయరన్నారు.. అయితే, బిగ్ బాస్ ను కూడా ఆధారాలు దొరకగానే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.. ఈ స్కామ్ లో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తుందని వెల్లడించారు పెమ్మసాని..
న్యాయమూర్తి ఎదుట కంట తడి పెట్టారు రాజ్ కేసిరెడ్డి.. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరాడు కేసిరెడ్డి.. తాను 2024 జూన్ లో ఆ డబ్బు వరుణ్ కి ఇచ్చినట్టు చెబుతున్నారని.. ఆ నోట్లు RBI ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు..
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. సిట్ అధికారులు ఓ వైపు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు.. మరోవైపు, ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయల్దేరాడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..