Chevireddy Bhaskar Reddy: లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు… ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి నరకం చూపిస్తూన్నారట.. కాళ్లు, చేతులో కట్టేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వేధించి చెవిరెడ్డి పేరు చెప్పించాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే, మీరు నన్ను అరెస్టు చేయాలని అనుకుంటే నేనే నేరుగా సిట్ ఆఫీస్ కు వస్తానని ఛాలెంజ్ చేశారు.. లిక్కర్ కేసులో నా పేరు లేకపోయినా.. నన్ను ఇరికించడానికి పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు… మీరు ఎంత ఇబ్బంది పెట్టినా నేను సిద్ధం అన్నారు చెవిరెడ్డి.
Read Also: Kaleshwaram Commission: మరోసారి కేసీఆర్, హరీష్ రావు భేటీ.. మరో నివేదిక సిద్దం!
ప్లాన్ ప్రకారం లిక్కర్ కేసులో బెదిరించి మా పేర్లు బయటకు తీసుకుని రావాలని చూస్తున్నారు.. అమాయకపు వ్యక్తులను వేధించడం బాధాకరం అన్నారు చెవిరెడ్డి.. మాజీ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ అధ్వర్యంలోనే లిక్కర్ కేసు విచారణ సాగుతోంది… ఆయన స్ర్కీప్ట్ తోనే లిక్కర్ కేసులో నా పేరు బయటకు తెచ్చారు.. మమ్మల్ని జైలుకు పంపాలి అంటే పంపండి అని సూచించారు. అయితే, భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు.. నాతో ఉన్న వారందరినీ తీసుకెళ్లి వేధించాలని చూస్తున్నారు.. సిట్ కార్యాలయంలో కాకుండా ఓ రహస్య ప్రదేశంకు తీసుకువెళ్లి పోలీసులు హింసిస్తున్నారు.. చెవిరెడ్డికి లిక్కర్ కేసులో సంబంధమున్నట్లు చెబితే తప్ప వదిలేది లేదని పోలీసులు భయపెడుతున్నారు.. తమ వారిని పోలీసులు అక్రమంగా తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురించేస్తుండటంపై బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల దుశ్చర్యలపై హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయనున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.