AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది.. లిక్కర్ స్కాం కేసులో నిందితుల విదేశీ పర్యటనలపై సిట్ ఫోకస్ పెట్టింది. స్కాంలో ముడుపులకు సంబంధించి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా వేర్వేరు దేశాలు కూడా హవాలా మార్గంలో మళ్లించారని ఇప్పటికే అనుమానిస్తున్న నేపథ్యంలో నిందితుల విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను సిట్ సేకరిస్తోంది..
Read Also: Fake Gold Scam: తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని భారీ మోసం.. ఏకంగా రూ. 65 లక్షలు స్వాహా..!
లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి నిందితులు ముడుపులను విదేశాలకు ఏ విధంగా మళ్లించారు అనే విషయానికి సంబంధించి సిట్ లోతైన విచారణ చేపట్టింది. స్కామ్ లో వసూలు చేసిన డబ్బుని హవాలా మార్గంలో కూడా విదేశాలకు మళ్లించినట్టు సిట్ అనుమానిస్తోంది.. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు.. పరారీలో ఉన్న నిందితుల.. విదేశీ టూర్లకు సంబంధించిన అన్ని వివరాలను విచారణ అధికారులు సేకరిస్తున్నారు.. ఇందులో కొన్ని కీలక వివరాలను ఇప్పటికీ గుర్తించినట్టు సమాచారం.
లిక్కర్ స్కామ్ లో నిందితులు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణిక్య దిలీప్ ఎక్కువగా విదేశీ పర్యటనలు చేసినట్టు అధికారులు గుర్తించారు.. యూకే, యూఎస్, దుబాయ్, టాంజానియా దేశాల్లో వీరు పలుమార్లు పర్యటనలు చేసినట్టుగా సిట్ విచారణలో గుర్తించారు.. రాజ్ కేసిరెడ్డి భార్య కూడా విదేశీ పర్యటనలు చేసినట్టుగా వివరాలు గుర్తించారు. ఇటీవల ఈ కేసుకు సంబంధించి అధికారులు విచారించిన ప్రణయ్ ప్రకాష్ కూడా వేరే దేశాల్లో పెట్టుబడులకు నిందితుల సహకరించినట్లుగా స్టేట్మెంట్ సిట్ అధికారులకు ఇచ్చారు. దీంతో 2019 నుంచి 2024 వరకు విదేశీ టూర్ల లో భాగంగా అక్కడకు వెళ్లి డబ్బును వేరువేరు మార్గాల్లో పెట్టుబడులుగా నిందితులు పెట్టినట్టు అనుమానిస్తున్న పోలీసులు విదేశీ టూర్ల వివరాలను సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న రాజ్ కేసీ రెడ్డి బృందంలోని మరికొందరు కూడా విదేశాల్లోనే ఉన్నట్టుగా గుర్తించారు.