ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కొత్తగా నిందితుల పేర్లు కేసులో చేరనున్నాయా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటికే ఈ కేస్ కి సంబంధించి 48 మంది మీద సిట్ కేసు నమోదు చేయగా ప్రస్తుతం జరుగుతున్న సోదాలు సేకరిస్తున్న వివరాలు ఆధారంగా మరికొందరు పేర్లు కేసులో యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది
విజయవాడలో కోర్టు వద్ద మరోసారి హల్‌చల్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఏపీ మద్యం స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన.. అప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతీసారి.. ఏదో హల్ చల్ చేస్తూ వస్తున్నారు.. అయితే, తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మీడియాలో కూడా ఇష్ట రీతిన అసత్య వార్తలు రాస్తున్నారని.. వారిపై న్యాయపోరాటం…
ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆరు రోజుల మధ్యంతర బెయిల్ గడువు పూర్తి కావడంతో సెంటర్ జైల్లో సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి..
ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు..
లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం .. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలిస్తున్నారు అధికారులు.
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సోమవారం రోజు సిట్‌కు ఝలక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లయ్ అవుతుందో చెప్పాలని అడిగారు.
సిట్ వారు సహకరించారు.. వారు ఆడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను... కేసుతో నాకేం సంబంధం లేదు.. అంతా పైవాళ్లే చేశారని నేను ఎక్కడ సిట్ అధికారులకు చెప్పలేదని స్పష్టం చేశారు.. సిట్ అధికారులు ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగాన.. నేను సమాధానం చెప్పాను... నన్ను అరెస్టు చేశారంటూ కోందరూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.