AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. సిట్ అధికారులు ఓ వైపు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు.. మరోవైపు, ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయల్దేరాడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్తున్నారు పోలీసులు .. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ లో ఉన్నారు మిథున్ రెడ్డి.. అయితే, ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు సిట్ అధికారులు.. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకువెళ్లుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయలుదేరిన సమయంలో జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Yuzvendra Chahal: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. విడాకులపై మౌనం వీడిన చాహల్