AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్, ముందస్తు బెయిల్ పిటిషన్లు రెండు ఒకేసారి నిందితులు దాఖలు చేయటం చర్చగా మారింది. 2 పిటిషన్లు దాఖలు చేశారు నిందితులు కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్. వైసీపీ హయాంలో ఏపీ బేవెరజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేయగా.. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారిగా పనిచేశారు సత్య ప్రసాద్. అయితే, ఈ నెల 18న అప్రూవర్ (టెండర్ ఆఫ్ పోర్డెన్) పిటిషన్లు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు నిందితులు. టెక్నికల్ రీజన్స్ తో రెండు పిటిషన్లు రిటర్న్ చేసింది ఏసీబీ కోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా టెక్నికల్ రీజన్స్ తో అదే రోజు రిటర్న్ చేసింది న్యాయస్థానం. ముందస్తు బెయిల్ పిటిషన్లు మరోసారి దాఖలు చేశారు ఇద్దరు నిందితులు.. అప్రూవర్ పిటిషన్ మాత్రం రెండోసారి దాఖలు చేయకపోవటంతో చర్చగా మారింది.. అయితే, లిక్కర్ స్కాం కేసులో నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ రోజు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ కి ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది.. తదరుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు..
Read Also: WAR 2 : వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఫిక్స్.. మాస్ బీభత్సమే