ఆంధ్రప్రదేశ్లో ఎస్సై నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అభ్యర్థుల ఎత్తు కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించారు.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు కేసులపై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేయనుంది న్యాయస్థానం. అయితే, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.. సీఐడీ. అటు అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు మీద విచారణ జరగనుంది.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ ఘటనపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2020లో ఘటన జరిగినపుడు 15 మంది మృతి చెందారు.
చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే.. ఆయనను నిర్ధోషి అని ప్రకటించలేదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సిన టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.