అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఐఆర్ ఆర్ కుంభకోణం కేసులో అనేక అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీడీపీ అధినేతను సీఐడీ నిందితుడిగా చేర్చింది. అయితే దీనిపై తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Read Also: Sakhi: క్లాసిక్ టైటిల్ తో మూవీ.. డిసెంబర్ 15న థియేటర్స్ లోకి
కాగా, చంద్రబాబు పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఇవాళ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని క్విడ్ ప్రోకో జరిగిందని న్యాయస్థానానికి తెలిపారు. భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయని ఏజీ శ్రీరామ్ తెలిపారు. సీఐడీ తరపున వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.