AP High Court: నిధుల మళ్లింపు కేసు.. టీటీడీ, తిరుపతి కార్పొరేషన్‌కి హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులకు మళ్లించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టెండర్లు ఫైనల్ చేసినా టీటీడీ నుంచి నిధులను మంజూరు చేయవద్దని టీటీడీ పాలకమండలిని ఆదేశించింది హైకోర్టు.. ధార్మిక సంస్థల నిధులను కార్పొరేషన్ల పరిధిలోని అభివృద్ధి పనులకు మళ్లించిన చరిత్ర ఎక్కడ లేదంటూ హైకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ .. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సెక్షన్ 111 కు చట్ట విరుద్దమంటూ హైకోర్టులో తన వాదనలు వినిపించారు.. అయితే, పిటిషన్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హై కోర్టు.. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా టీటీడీ, తిరుపతి కార్పొరేషన్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హై కోర్టు.
Read Also: Hero Srisimha : శ్రీ సింహ పెళ్లి డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Also Read
కాగా, టీటీడీ బడ్జెట్‌లో 1 శాతం తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది.. ఈ నిధులు మళ్లింపును సవాల్ చేస్తూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్ రోడ్లు, పారిశుద్ధ్యానికి కేటాయించడం చట్ట విరుద్ధమని అంటున్నారు.. ఎండోమెంట్ చట్టం 111 ప్రకారం నిధులు మళ్లింపు చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ హైకోర్టులో వాదనలు వినిపించగా.. ఇప్పుడు నిధుల మళ్లింపునకు హైకోర్టు బ్రేక్‌లు వేసినట్టు అయ్యింది.. మరి హైకోర్టులో టీటీడీ, తిరుపతి కార్పొరేషన్ ఎలంటి కౌంటర్ దాఖలు చేస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!