అమరావతి: ప్రభుత్వ జీఓలను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంపై దాఖలపై పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పటిషనర్ల వాదన విన్న న్యాయస్థానంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారించిన కోర్టు జీవోలను RTI ద్వారా పొందవచ్చు కదా అని పటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా.. జీవోలు విడుదలయినట్లు కూడా తెలియడం లేదని, అటువంటప్పుడు ఆర్టీఐ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జి.వోలను ఆన్లైన్లో పెట్టకపోవడం…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ప్రతివాదులు 26 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసుల విచారణ ప్రారంభం అవుతుంది. ఇసుక పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని.. దాంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు ఫైల్ చేశారు.
ఎస్సై పోస్టుల నియామకంలో అన్యాయం జరిగిందని తప్పు పిటిషన్ దాఖలు వేసిన పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ప్రభుత్వ ఆసుపత్రిని శుభ్రం చేసి సామాజిక సేవ చేసేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులకు మళ్లించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టెండర్లు ఫైనల్ చేసినా టీటీడీ నుంచి నిధులను మంజూరు చేయవద్దని టీటీడీ పాలకమండలిని ఆదేశించింది హైకోర్టు.
విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపు పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రోస్టర్ ప్రకారం తన బెంచ్కు పిటిషన్ వచ్చిందని, తాను విచారించి ఆదేశాలు ఇవ్వొచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.