AP High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రోస్టర్ ప్రకారం తన బెంచ్‌కు పిటిషన్ వచ్చిందని, తాను విచారించి ఆదేశాలు ఇవ్వొచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఏజీ అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో దీనిపై ఇంటరమ్ అప్లికేషన్ వేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు.
Read Also: Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్
ఈ లోపు కార్యాలయాలు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టును కోరారు. కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం ఇలానే చెప్పి, కార్యాలయాలను తరలించేందుకు అంతర్గత ఏర్పాట్లు చేస్తుందని పిటీషనర్ న్యాయవాది వెల్లడించారు. తరలింపుపై ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.