జనసేనకు గ్లాస్ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
గూగుల్, యూట్యూబ్లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు పిటిషన్ను దాఖలు చేశారు. కాగా.. ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిగింది.…
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా.. రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్న…