ప్రభుత్వ జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు.. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జీవోల గోప్యతపై హైకోర్టులో వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.
చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, సీఐడీకి హైకోర్టు షాకిచ్చింది.. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో మరికొన్ని షరతులు విధించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఎల్లుండి(నవంబర్ 3)కి వాయిదా వేసింది.
రుషికొండ నిర్మాణాలపై మరోసారి ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి ఎంక్వైరీ చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు తుంగలో తొక్కారు అని సీఐడీ అధికారులు అంటున్నారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఏపీ సీఐడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఆయనపై హైకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఏపీ సీఐడీ రెడీ అయినట్లు టాక్.
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు సంతోషకరం అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్.. అయితే, చంద్రబాబును మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దని సూచించారు.