రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యశాఖ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. భారత ప్రభుత్వం మత్స్యశాఖలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకం, మెమొంటో అందించిందని మంత్రి సీఎం జగన్‌కి వివరించారు. కేంద్ర ప్రభుత్వం…
రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా…
ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్…
ఓ కీలకమైన విషయానికి సంబంధించి ప్రభుత్వం ఆ పెద్దాయన్ని సలహాదారుగా నియమించుకుంది. సలహాలతో ప్రభుత్వానికి సరైన గైడెన్స్ ఇవ్వడమో.. లేక సమన్వయమో చేయాలి. ఆ సలహాదారు మాత్రం టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు. తాను చెప్పినా ఎవరూ వినరని నిస్తేజమా? నాకెందుకులే అనే భావనా? ఏదీ అర్థం కాకుండా ఉందట. మరి ఆయనకు పదవి ఇచ్చి ఏ లాభం అనే చర్చ అప్పుడే మొదలైపోయిందట. ఇంతకీ ఎవరాయన? ఉద్యమంలో ఉద్యోగులు.. సలహాదారు సన్మానాల్లో..! చంద్రశేఖర్ రెడ్డి. APNGO…
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో అంతర్గత మెమో జారీ చేసింది ఏపీ ఉన్నతవిద్యా శాఖ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో తాజా మెమో జారీ చేసింది సర్కార్. 2249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది. 702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని స్పష్టీకరించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని…
ఏపీ ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడారు. వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరామన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరాం. సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారు. నా చేతుల్లో…
ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోము వీర్రాజు. ఆయన మాట్లాడుతూ… జగనుకు మోడీ భయం పట్టుకుంది. మోడీతో జగన్ ఢీ అనాలనుకుంటే మేమూ సిద్ధంగా ఉన్నాం. మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదు. మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల…
పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ ఒక్కడే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా ఏపీ మాత్రం బాదుడు విషయంలో వెనక్కి తగ్గనంటోంది. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వం అభాసు పాలయ్యింది. చంద్రబాబు హయాంలో ప్రజల పై…
ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ గతంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్ధల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు రంగంలోకి దిగారు. ఆ ఆదేశాలతో విద్యాశాఖాధికారులు తమ ప్రతాపం చూపడం మొదలెట్టారు. పురాతనమయిన, ఎంతో చరిత్ర కలిగిన విద్యాసంస్థల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు…
సామాన్యలలో అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో తొలిసారి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానం చేయనున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ – కన్వెన్షన్ సెంటర్లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టనుంది ప్రభుత్వం. 2021 సంవత్సరానికి 29 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 30 వైఎస్సార్ అచీవ్మెంట్…