వరికి బదులు మిల్లెట్స్ పండించండి.. రైతులకు జగన్ సలహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలి. రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం జగన్. వ్యవసాయ అనుబంధ రంగాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులకు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలన్న ఒక సదుద్దేశం.. క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారితీశాయి. వీటిని నీరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ వ్యవహారాల్లో ఉద్యోగులు ప్రమేయం ఉంటే.. వారిని తొలగించడమే కాదు.. చట్టంముందు నిలబెడతామని జగన్ హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు.
దీనికోసం చట్టంలో మార్పులు, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి. వరి పండిస్తే… వచ్చే ఆదాయం మిల్లెట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి. దీనికోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి. మిల్లెట్స్ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలి. మిల్లెట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి. సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు.
రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలి. రసాయనాలు లేని సాగుమీద మంచి విధానాలను తీసుకురండి. ఆర్బీకే యూనిట్‌గా ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలి. సేంద్రీయ వ్యవసాయినికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఖరీఫ్‌లో 1.12 కోట్ల ఎకరాల ఇ–క్రాప్ జరిగిందన్నారు. 45,35,102 మంది రైతులు ఇ– క్రాప్ చేయించుకున్నారని జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!