ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ గతంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్ధల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు రంగంలోకి దిగారు. ఆ ఆదేశాలతో విద్యాశాఖాధికారులు తమ ప్రతాపం చూపడం మొదలెట్టారు. పురాతనమయిన, ఎంతో చరిత్ర కలిగిన విద్యాసంస్థల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు…
సామాన్యలలో అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో తొలిసారి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానం చేయనున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ – కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టనుంది ప్రభుత్వం. 2021 సంవత్సరానికి 29 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, 30 వైఎస్సార్ అచీవ్‌మెంట్…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు దని విమర్శించారు. ఉపాధి హామీ నిధులు వ్యయంపై విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారని మండిపడ్డారు. ఈ విధంగా రెండు వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం…
ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల నిర్వహణ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎయిడెడ్ పాఠశాలల పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అనంతపురం నగరంలోని గిల్దాఫ్ ఎయిడెడ్ బాలికల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం బలవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా పేద విద్యార్థులు పల్లెల నుంచి వచ్చి చదువుకుంటున్నామని,…
ఆంధ్రుల పాలిట వరం పోలవరం విషయంలో కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతుండడం అసహనం పెంచుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపిందని తెలుస్తోంది. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి…
ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. నిబంధనలకు అనుగుణంగా నిధులు ఖర్చుచేయలేదని ఫిర్యాదులు అందడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొంది కేంద్రం. ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. నిబంధనల అనుగుణంగా ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయకపోవటంపై వివరణ ఇవ్వాలని ప్రణాళికా విభాగం ముఖ్య…
ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకంపై ఈ నెల 20న సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనుంది. ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైంలో ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు.. సినీ ప్రముఖులు, థియేటర్ ఓనర్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని…
70:30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపకం జరగాలని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం మేర నీటి పంపకం చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది ఏపీ. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి…
ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇక నుంచి తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జార్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. కరోనా కారణంగా 2020 మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం… ఈ నెల 13 తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ హాజరును తప్పని సరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్…