Andhra Pradesh: ఉద్యోగ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది.. సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసే ఆఫీస్ బేరర్ల లేఖల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది జీఏడీ. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. సర్వీసెస్ అసోసియేషన్ల లేఖలను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది.. సిఫార్సు లేఖల్లో నకిలీవి ఉంటున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లోనూ నకిలీ లేఖలు వస్తున్నాయని ఉత్తర్వుల్లో జీఏడీ పేర్కొంది.. ఆఫీస్ బేరర్ల సిఫార్సు లేఖలను స్క్రూట్నీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు కోసం ఆఫీస్ బేరర్లుగా లేఖలిచ్చిన ఉద్యోగుల వివరాలు తెలపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది జీఏడీ.
Read Also: Medico Preethi Case: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో.. కోర్టుకి చార్జ్‌షీట్ సమర్పించిన పోలీసులు