ఆంధ్రప్రదేశ్ లో రేపటి( సోమవారం) నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటికే స్కూల్స్ పున: ప్రారంభాన్ని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో రాష్ట్రంలో వేడి గాలుల కారణంగా ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: Cm Jagan: విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. రేపే విద్యా కానుక..
అయితే పాఠశాలలు ఉదయం ఏడున్నర గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకే తరగతుల నిర్వహణ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున రీ-ఓపెన్ తేదీని వాయిదా వేయాలన్న వినతులను పరిగణలోకి తీసుకున్న సర్కార్.. ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణకు మొగ్గు చూపింది. దీంతో రేపట్నుంచి విద్యార్థులు ఉదయం 7.30 గంటల నుంచి ఉ. 11.30 గంటల వరకు స్కూల్స్ కి వెళ్లనున్నారు. దీంతో ఉదయం 08:30-09:00 గంటల మధ్యలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: OTT Apps : OTT యాప్స్.. మీ జేబును ఎలా లూటీ చేస్తున్నాయో తెలుసుకోండి?
అయితే ఏపీలో ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ రెండో వారం ముగిసిపోతున్నా.. సూర్యుడు ఇంకా భగభగమంటున్నాడు.. అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. భారీ ఎండల నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవులపై మరోసారి ఆలోచించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. దీనిపై స్పందించిన ఏపీ సర్కార్ ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.