Bosta Satyanarayana: అకాల వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.. ఆ నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. మరోవైపు.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ.. వారిని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు.. అయితే, ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. ప్రజల్లో గుర్తింపు కోసమే చంద్రబాబు రైతు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Read Also: Adipurush: టీజర్ లో ట్రోల్ చేశారని.. అతడిని ట్రైలర్ లో లేపేశారా..?
మరోవైపు అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు.. ఇక, అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు నష్ట పరిహారంపై ప్రత్యేక అధికారులను నియమించాం. ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందన్నారు.. అలాగే, మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఇంకెవరైనా ఉంటే తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులతో టచ్‌లో ఉన్నామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.