రేపు(మంగళవారం) మున్సిపల్ కార్మిక సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కార్మిక సంఘాలతో మంత్రులు భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు.. అయితే, వారి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.. పలు డిమాండ్లపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది..
మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 15 వ తేదీ నుంచి రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసింది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థాయంలో అఫిడవిట్ దాఖలు చేసింది.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2023-24 గాను రెండో విడత సాయాన్ని ఇవాళ విడుదల చేయబోతోంది. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు…
గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసింది ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. అందులో భాగంగా క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ పెడుతోంది.. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒప్పందాలు చేసుకుంటుంది.. 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం.