అంగన్వాడీల ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ అధిష్టానందే తుది నిర్ణయం అని ఆమె చెప్పుకొచ్చారు. రేపు అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించక పోవడం శోచనీయం అని అన్నారు
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు ఆంధ్రప్రదేశ్లో సెలవుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతో.. రాష్ట్రంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.. అయితే, ఏపీలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు.. 22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా…
కార్మిక సంఘాల ఆందోళనల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అంగన్వాడీలతో మరోసారి చర్చలు జరపనుంది ఏపీ ప్రభుత్వం.. అంగన్వాడీ సంఘాలకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చింది.. ఈ సాయంత్రం 3 గంటలకు చర్చలు జరపనున్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ .. ఈ చర్చలకు సచివాలయం వేదిక కానుంది..
ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 19 తేదీ నుంచి 28 తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కార్మిక సంఘాలతో సచివాలయంలోని సెకండ్ బ్లాక్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్గా సమావేశం కానున్నారు.
ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా బంఫర్ ఆఫర్ ఇచ్చింది.. వచ్చే నెల 1 వ తారీఖు నుంచి ప్రతి నెలా జీతంతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగలకు నైట్ హాల్ట్ అలవెన్స్ ఇచ్చేదుకు ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు.. ఇది ఉద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి.. ఇక అంతేకాదు.. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బకాయిలతో…
సచివాలయంలో మున్సిపల్ కార్మికులతో జీవోఎం చర్చలు ముగిసాయి. కార్మిక సంఘాల డిమాండ్ల పై మంత్రి బొత్స, సజ్జల, అధికారులు విడిగా చర్చించారు. కనీస వేతనం 21 వేల కంటే అదనంగా మరో మూడు వేలు అయినా పెంచాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా.. గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని మున్సిపల్ కార్మిక సంఘాలు కోరారు. అయితే.. జీతాలు 24 వేలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. కాగా.. సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు…
ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు.