ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా బంఫర్ ఆఫర్ ఇచ్చింది.. వచ్చే నెల 1 వ తారీఖు నుంచి ప్రతి నెలా జీతంతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగలకు నైట్ హాల్ట్ అలవెన్స్ ఇచ్చేదుకు ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు.. ఇది ఉద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి..
ఇక అంతేకాదు.. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతో సహా ఉద్యోగులకు ఫిబ్రవరి 1న అందేలా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం, డిమాండ్లను పరిష్కరించనున్నట్లు సర్కార్ హామీ ఇచ్చింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్స్‌లను ఉద్యోగులకు సంస్థ ఇప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తుంది.. గత ఏడు ఏళ్లుగా బకాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది..
గత 2017 నుంచి పే రివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇటీవలే వాటన్నింటినీ క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. తాజాగా నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.. అందుకే వచ్చే నెల 1న అందే వేతనంలో నైట్ హాల్ట్ అలవెన్సులను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..