Anganwadi Strike: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె 32వ రోజుకు చేరింది.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్.. ఓవైపు ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ.. విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆందోళన మాత్రం విరమించడం లేదు.. తమ సమస్యలు పరిష్కరించి, డిమాండ్లను తీర్చాల్సిన ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు.. అయితే, కార్మిక సంఘాల ఆందోళనల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అంగన్వాడీలతో మరోసారి చర్చలు జరపనుంది ఏపీ ప్రభుత్వం.. అంగన్వాడీ సంఘాలకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చింది.. ఈ సాయంత్రం 3 గంటలకు చర్చలు జరపనున్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ .. ఈ చర్చలకు సచివాలయం వేదిక కానుంది..
Read Also: Maldives- India: భారత్- మాల్దీవుల మధ్య క్షీణిస్తున్న దౌత్య సంబంధాలు.. చైనానే కారణం..?
కాగా, నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు.. ఇప్పటికే సమ్మె, ఆందోళనలు నిషేధిస్తూ ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం.. అయినా వెనక్కి తగ్గని అంగన్వాడీలు.. సమ్మె కొనసాగిస్తున్నారు. విధుల్లోకి రాకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.. కానీ, అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో.. సమస్య జటిలం కాకుండా చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మె విరమింప చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అంగన్వాడీల విషయంలోనూ అదే పంతా కొనసాగించాలనే ఆలోచనతో మరోసారి ఆయా సంఘాల నేతలను చర్చలకు పిలిచింది.