ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్- 2 వద్ద మంత్రుల కమిటీతో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనున్నారు. కాగా, పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్‌లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది. గత కొద్ది నెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి.
విద్యారంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వ అధికారులు, ఎడ్‌క్స్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అన్నారు
ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం కుదిరింది.
ఏపీలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది.
వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.