AP Pensions: పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. రాత్రికల్లా మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని పలువురు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: Prasanna Kumar Reddy: సీఎంగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..
Also Read
గ్రామ, వార్డు సెక్రటరీలతో పెన్షన్లు పంపిణీ చేసినా.. వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని పలువురు కలెక్టర్లు వెల్లడించారు. .రూరల్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కుదురుతుంది కానీ.. అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరమవుతుందన్న ఇంకొందరు కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని డిసైడ్ చేయాలంటే.. సచివాలయాల వద్ద టెంట్లు.. తాగు నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్లు కోరారు. ఇవాళ రాత్రికి పెన్షన్ల పంపిణీ మీద గైడ్ లైన్స్ సిద్దం చేస్తామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!