Yanamala Ramakrishnudu: ఎన్నికల కోడ్ ఉండగానే రూ.20 వేల కోట్ల అప్పు..! యనమల ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yanamala Ramakrishnudu: ఏపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఏపీలో వైఎస్ జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతే అని హెచ్చరించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ రెడ్డి ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చారు. 2023-24 లో ఆర్బీఐ నుంచే కేవలం మంగళవారం అప్పులే రూ.70 వేల కోట్లు చేశారని.. జగన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు రూ.257 కోట్లు చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు బహిరంగ మార్కెట్‌లో అప్పులు చేసిందని విమర్శించారు. శాసనసభకు చెప్పి చేస్తామన్న అప్పులు ఇవి రెండింతలు ఎక్కువ. రాబోయే ప్రభుత్వాల అప్పులను సైతం జగన్ రెడ్డే చేయాలనుకుంటున్నాడు. ఎన్నికల కోడ్ ఉండగానే 2024-25 ఆర్ధిక సంవత్సరం అప్పులలో రూ.20 వేల కోట్లు జూన్ 4 లోపే చేసేయాలని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు.
Read Also: KTR: కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇక, రాష్ట్రాన్ని ఆర్ధిక అధోగతి పాలుకాకుండా కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ రెడ్డిని ఓడించాల్సిందే అని పిలుపునిచ్చారు యనమల రామకృష్ణుడు.. అప్పులతో కొనసాగే సంక్షేమ రాజ్యం ఎప్పటికైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. పేదలను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించాలంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం అందించే కూటమిని గెలిపించాలని సూచించారు. కాగా, గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే. ఎన్నికల తరుణంలో మరోసారి హాట్ కామెంట్స్ చేశారు యనమల.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..