AP Pensions: ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. గత నెలలో సచివాలయం దగ్గర వృద్ధులు, పెన్షన్‌దారులు పడిగాపులు పడాల్సి రాగా.. ఇక, ఈ నెల చాలా మందికి బ్యాంకుల్లో నగదు జమ చేసింది ప్రభుత్వం.. అయితే, ఆ డబ్బుల కోసం బ్యాంకుల దగ్గర భారీ క్యూలు దర్శనమిచ్చాయి.. ఒక్కసారిగా బ్యాంకులకు దగ్గరకు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. వారికి పెన్షన్లు పంపిణీ చేయడం బ్యాంకర్లకు సవాలుగా మారింది.. మరోవైపు.. కొన్ని సాంకేతిక కారణాలతో డబ్బులు తీసుకోకుండా వృద్ధులు వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.. మే 1వ తేదీన ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ.. ఈ రోజు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ కానివారికి మే 4వ తేదీన అంటే.. రేపు (శనివారం) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.. దీనిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు..
Read Also: Germany floods: జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వాహనాలు
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 74,399 మంది పెన్షనర్లకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానట్లు గుర్తించామని వెల్లడించిన ఆయన.. వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.. ఇక, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమకానివారి జాబితాను ఈ రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.. మరోవైపు.. రాష్ట్రంలోని మొత్తం 65.49 లక్షల మందికిగాను 63.31 లక్షల మంది పింఛనుదారులకు వారి ఖాతాల్లో నగదు జమ చేశామని అంటే.. సరాసరి 96.67 శాతం నగదు బ్యాంకుల ఖాతాల్లో జమ అయ్యిందని.. మిగతా వారికి ఇంటివద్దే పంపిణీ చేస్తామని తమ ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్.