కరోనా పీక్ స్టేజీలో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్రం ఇచ్చిన కేటాయింపులను పూర్తి స్థాయిలో వివియోగించుకునే దిశగా కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది. కొన్ని మూతపడిన ప్లాంట్ల నుంచి కూడా ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రోజువారీ వినియోగానికి ఏపీకి 482 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు కేటాయించింది కేంద్రం. ప్రస్తుతం ట్యాంకర్ల కొరత కారణంగా పూర్తి స్థాయిలో కేంద్ర కేటాయింపులను…
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని… ఏపీలో 2 కోట్ల 4 లక్షల మంది 18-45 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టీకాల కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామని..ఉత్పత్తిలో సగం కేంద్రానికి ఇవ్వాలి ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి…
ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22వ సంవత్సరానికి అవసరమైన ఎరువుల కొనుగోళ్లు, సరఫరాకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఎరువుల కొనుగోళ్లకు అవసరమైన నిధుల కోసం ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల కొనుగోళ్లు, సరఫరా, బఫర్ స్టాక్ కోసం రూ. 500 కోట్ల మేర రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మార్క్…
ఏపీలో ఈరోజు 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. అయితే వాటిని జిల్లాలకు పంపిణీ చేసింది వైద్యారోగ్య శాఖ. ఇక ప్రాధాన్యతల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా వాక్సినేషనులో హై ప్రయార్టీ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. హెల్త్ కేర్ వర్కర్లకు వచ్చే 72 గంటల్లో వంద శాతం మేర వ్యాక్సినేషన్ చేయాలని కలెక్టర్లకు సూచించారు.…
కరోనా సెకండ్ వేవ్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.. దీంతో.. ఆస్పత్రుల్లో బెడ్స్ లేని పరిస్థితి వచ్చింది.. ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఇబ్బంది పెడుతుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ బెడ్ల కొరతపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనన్ని ఎక్కువ బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.. బెడ్ల కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతుండడంతో.. అసలు ఉన్న బెడ్లు…
రోడ్ల నిర్మాణ చెల్లింపుల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పూర్తి చేసిన పనికి నేరుగా బ్యాంకుల ద్వారానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్- RDC ఎండీ కాంట్రాక్టర్ల జాబితాను CFMS ద్వారా సంబంధిత బ్యాంకులకు అందచేయాలని ఆదేశించింది. విడుదల చేయాల్సిన నిధుల వివరాలను బిల్లులతో సహా CFMS ద్వారా బ్యాంకులకు అందచేయాలని సూచించింది. RDC ఎండీ ఖాతాకు నిధులు విడుదల చేసి అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ చేయనున్నాయి…
2021-22 సంవత్సరంలో నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ప్రకటించింది ప్రభుత్వం. వివిధ సంక్షేమ పథకాలను ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నారనే విషయాన్ని వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, రైతులకు సున్నా వడ్డీ(రబీ) అమలు చేస్తారు. ఇక మేలో ఉచిత పంటల బీమా(ఖరీఫ్), వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా… జూన్ లో జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ చేయూత… జులైలో…
ఆంధ్రప్రదేశ్ లో ‘వకీల్ సాబ్’ కి ప్రభుత్వానికి మధ్య పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రాజకీయరంగు పులుముకున్న ఈ వివాదం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల విడుదల సయమంలో టిక్కెట్ రేట్లు పెంచి అమ్మట అనేది గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. అయితే పవన్ జనసేన అధిపతిగా బిజెపీ తో పొత్తు పెట్టుకుని రాజకీయం నడుపుతున్న సందర్భంగా ఆయన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం లేకుండా…