కరోనా మందు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు ఎంత పేరు తెచ్చిందో.. అన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది.. ఆయన తయారు చేస్తున్న కరోనా మందుపై తేల్చేపనిలో ఉన్న ప్రభుత్వం.. అదే సమయంలో.. ఆయనకు భద్రత కల్పించి.. ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం.. ఆయనకు కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. అయితే, వారం రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆనందయ్య.. తాను ఎక్కడికీ పోనని ఇక్కడే ఉంటానని చెప్పారు.. కానీ, కృష్ణపట్నంలో రాత్రి హై డ్రామా నెలకొంది.. ఆనందయ్యకు భద్రత దృష్ట్యా అజ్ఞాతంలోకి తరలించాలని పోలీసులు భావించగా.. నిరాకరించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఆనందయ్యకి భధ్రత కల్పిస్తూన్నారా? లేక కస్టడిలోకి తీసుకుంటున్నారా? అని గ్రామ ప్రజలు నిలదీశారు.. దీంతో.. రాత్రి వెనక్కి తగ్గిన పోలీసులు.. ఉదయం 5 గంటలకు మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. ఈసారి ఆనందయ్య భార్యను కూడా తీసుకెళ్లారు.. కాగా, ఇవాళ ఆనందయ్య మందుపై తుది నివేదిక వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు తెలిపారు.. అన్ని అనుకున్నట్టు జరిగితే.. సోమవారం మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఆయన మందు పంపిణీని అనుమతి వచ్చే వరకు ఆనందయ్యకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు.