ఆనందయ్య మందుకు అనుమతి ఇస్తారా? లేదా? అంటూ గత కొంతకాలంగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. మొత్తానికి ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కుల మందుకు అనుమతి నిరాకరించింది.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున.. ప్రస్తుతానికి ఆ మందుకు అనుమతి నిరాకరించింది. ఇక, ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు అన్ని. ఆనందయ్య మందు వల్ల హాని లేదని తేల్చేశాయి.. కాగా, మొత్తం ఐదు రకాల మందులు తయారు చేస్తూ వచ్చారు ఆనందయ్య.. అందులో కంట్లో వేసే మందుకు మాత్రం ఇప్పుడు బ్రేక్ పడగా.. మిగతా నాలుగు మందులు తయారు చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు అయ్యింది.
అయితే, ఆనందయ్య మందుతో హానిలేదని నివేదికలు తేల్చినా.. ఆ మందు వాడితే కోవిడ్ తగ్గుతుందనడాకి నిర్ధారణ లేదని నివేదికలో పేర్కొన్నారు. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదిక రావడానికి మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతోంది ఏపీ సర్కార్.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు తీసుకోవడానికి కోవిడ్ రోగులు రావొద్దు అని స్పష్టం చేసింది.. కోవిడ్ రోగుల బంధువులు వచ్చి మందు తీసుకెళ్లాలని సూచించింది. ఇక, మందు పంపిణీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసేంది.. ప్రస్తుతానికి అయితే.. ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.