రఘురామ విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ కరోనాను సీరియస్ గా తీసుకోలేదు అని బీజేపీ లీడర్ కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదు. సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ 35వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. రాష్ట్రంలో కోవిడ్ ను రాజకీయం చేస్తున్నారు. వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఆక్సిజన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు.
రెమీడెసీవిర్ ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకురావటానికి చేయాల్సినంత ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన సమయంలో కూడా చర్చిల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఎంపి రఘురామ విషయంలో తేలిపోయింది. ఎంపీ విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం. ప్రవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇవ్వొద్దని సీఎం లేఖ రాయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. మౌలికసదుపాయాలు కల్పన, వ్యాక్సిన్ తీసుకురావటంపై సీఎం శ్రద్ద పెట్టాలి. ఏపీకి ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర బిజెపి కూడా మద్దతిస్తోంది. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?