ఆంధ్రప్రదేశ్ లో ‘వకీల్ సాబ్’ కి ప్రభుత్వానికి మధ్య పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రాజకీయరంగు పులుముకున్న ఈ వివాదం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల విడుదల సయమంలో టిక్కెట్ రేట్లు పెంచి అమ్మట అనేది గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. అయితే పవన్ జనసేన అధిపతిగా బిజెపీ తో పొత్తు పెట్టుకుని రాజకీయం నడుపుతున్న సందర్భంగా ఆయన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం లేకుండా…