తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరిస్థితి ఉంది కాబట్టే.. సైకిల్ బెల్ మోగిస్తు ప్రజలను భ్రమ పెడుతున్నారనీ విమర్శించారు
తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు.
ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మంచి చేసే వారికే మద్దతు ఇవ్వాలని, ఉన్నతమైన విలువలు, నీతి, నిజాయతీ కలిగిన నాయకులకు మీ ఆశీస్సులు అందించి ఆశీర్వదించండని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.
జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి.. అమ్మ కడుపున ఆఖరివాడు.. అందరికి మేలు కోరే విషయంలో మొదటి వాడు.. నా తమ్ముడు పవన్ కల్యాణ్.. తన గురించి కంటే.. జనం గురించే ఎక్కువ ఆలోచిస్తాడు అని పేర్కొన్నారు చిరంజీవి.
కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా కుమారుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ తన తండ్రి కోసం పల్లె పల్లెను పలకరిస్తూ.. ప్రజలతో మమేకమౌతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు.