ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 6వ వార్డులో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వార్డులోని ప్రజలను అప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని సమస్యలను ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో పరిష్కరిస్తానని ఆయన భరోసా కల్పిస్తున్నారు.
Read Also: Rafah crossing: రఫా క్రాసింగ్ లోని పాలస్తీనా భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
ఇక, మన పిల్లల భవిష్యత్త్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవటం మనకు చాలా అవసరం అని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. 50 సంవత్సరాలు నిండిన వారికి జూన్ నెల నుంచి 4000 రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు. మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు పైన వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తిరువూరు పట్టణం మూడో వార్డుకు చెందిన పేరుమల్ల నిరంజన్ తన ఇంటి దగ్గర నుంచి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
Read Also: Chiranjeevi For Pawan Kalyan: రంగంలోకి మెగాస్టార్.. పవన్‌ను గెలిపించండి..
తిరువూరు పట్టణం మూడో వార్డుకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు మాజీ జడ్పీటీసీ పేరుమల్ల యేసురత్నం కుమారుడు పేరుమల్ల నిరంజన్ భారీ సంఖ్యలో తన అనుసరులతో కలిసి టీడీపీ పార్టీలోకి చేరటం జరిగింది. వారిని హృదయపూర్వకంగా కొలికపూడి పార్టీలోకి ఆహ్వానించారు. విసన్నపేట మండలం కొండపర్వ గ్రామం నుంచి కొత్తపల్లి మహేష్ తో పాటు మరో 20 కుటుంబాలు టీడీపీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. వారందరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, చంద్రబాబు అధికారంలోకి రాగానే, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇటు తిరువూరులో, రాష్ట్రంలోనూ కూడా ఈసారి ఎగిరేది పసుపు జెండానే అని ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.