Chiranjeevi For Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.. అయితే, మెగా ఫ్యామిలీ హీరోలు, బుల్లితెర, వెండితెర నటీనటులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.. ఇక, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడి కోసం రంగంలోకి దిగారు.. తన గురించి కంటే.. జనం గురించే ఎక్కవగా ఆలోచించే తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.. తన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వదిలారు చిరంజీవి..
Read Also: PM Modi: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని సహించబోం.. కర్ణాటక సర్కారుపై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి.. అమ్మ కడుపున ఆఖరివాడు.. అందరికి మేలు కోరే విషయంలో మొదటి వాడు.. నా తమ్ముడు పవన్ కల్యాణ్.. తన గురించి కంటే.. జనం గురించే ఎక్కువ ఆలోచిస్తాడు అని పేర్కొన్నారు చిరంజీవి.. అధికారంలోకి రాక ముందే తన సొంత సొమ్ముతో కౌలు రైతులకు సాయం చేశాడు.. జవాన్లకు అండగా నిలిచాడని గుర్తుచేసిన ఆయన.. పవన్ లాంటి నాయకుడే కావాలని సూచించారు. ఇక, పవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడని తెలిపారు చిరంజీవి.. పవన్ ఎంతో మందితో మాటలు పడుతుంటే మా అమ్మ బాధ పడుతోంది.. అన్నగా నేనూ బాధ పడుతున్నాను. ఎంతో మంది తల్లుల గురించి పవన్ పోరాటం చేస్తున్నాడు.. బాధ పడొద్దని మా అమ్మకు చెప్పాను అన్నారు..
Read Also: NBK 109: బాలయ్య సినిమా యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..
ఇక, అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటే మంచిది కాదని జనం కోసం పవన్ జన సైనికుడయ్యాడన్నారు మెగాస్టార్.. ప్రజల బాగు కోసం పవన్ గొంతు చట్ట సభల్లో వినపడాలన్న ఆయన.. పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.. ప్రజల కోసం సేవకుడిగా.. సైనికుడిగా పవన్ నిలబడతాడు.. అవసరమైతే కలబడతాడు. పవన్‌ను గెలిపించండి అని ఆ వీడియో ద్వారా కోరారు మెగాస్టార్ చిరంజీవి.. కాగా, ఇప్పటికే పవన్ కల్యాణ్ తరపున పిఠాపురంలో మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్, అల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో పాటు.. బుల్లితెర, వెండి తెర నటులు ప్రచారం నిర్వహిస్తోన్న విషయం విదితమే.
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024