CM YS Jagan: తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరిస్థితి ఉంది కాబట్టే.. సైకిల్ బెల్ మోగిస్తు ప్రజలను భ్రమ పెడుతున్నారనీ విమర్శించారు .. ముందుగా ఎర్ర చొక్క దగ్గరికి వెళ్లాడు.. అక్కడ ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని తీసుకువచ్చాడు.. కానీ, సైకిల్ తుప్పుపట్టింది కాబట్టి నేను వెనక కూర్చుని టీ గ్లాస్ పట్టుకుని తాగుతాను అన్నాడు.. అంతకన్నా నా వల్ల కాదు అన్నారు.. ఇక, వదినమ్మని ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్ ని తీసుకువచ్చారు.. వాళ్లు రిపేర్ చేయటానికి ప్రయత్నిస్తే ఆసైకిల్ కు హ్యాండిల్ లేదు, పెడల్స్ లేదు, సీటు లేదు, చక్రాలు లేవు, ట్యూబ్ కూడా లేదు.. ఇంత తుప్పు పట్టిన సైకిల్ ను ఎలా నడుపుతావని అడిగారని సెటైర్లు వేశారు.. అయితే, సైకిల్ తుప్పు పట్టినా.. బెల్ ఒక్కటే మిగిలిందని… ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగించాడు.. ఆ బెల్ పేరు అబద్ధాల మేనిఫెస్టో.. అధికారంలోకి వచ్చే వరకు అబద్ధాలు, మాయలు, మోసాలే చేస్తారంటూ ఆరోపణలు గుప్పించారు సీఎం జగన్.
Read Also: KTR: రాష్ట్రానికి వస్తున్న మోడీ గారు.. ప్రజా పక్షాన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్ ట్విట్
ఇక, చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను కోరారు సీఎం జగన్.. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు.. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే… పథకాలన్నీ ముగింపు అని హెచ్చరించారు.. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాను.. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయాలన్నారు.. మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్.