AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది.. పార్టీల అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.. ప్రతీ గ్రామాన్ని, ప్రతీ గడపను టచ్ చేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.. ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు అంటే.. అభ్యర్థి భార్య, కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, తమ్ముళ్లు, అన్నయ్యలు.. ఇలా చాలా మంది ప్రచారానికి దిగుతున్నారు.. అయితే, పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా తీవ్ర ఆవేదనకు గురయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి.. తనపై, తన భర్తపై అసత్య ప్రచారం చేసి, 2019లో ఓడించారని, 2024లో ప్రజలు నిజం తెలుసుకొని ఓటు వేయాలని మహిళలను కొంగు పట్టి అభ్యర్థించారు.. 2019 నుండి నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని, ఒక్క అవకాశం అంటూ గత ఎన్నికల్లో గెలిచినవారు నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరంగా నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రతి మహిళను, ప్రతి తల్లిని అడుగుతున్నా, వేడుకుంటున్నా , చిలకలూరిపేట అభివృద్ధి జరగాలంటే, తన భర్త పుల్లారావును గెలిపించాలి అంటూ కొంగు పట్టి ఓట్లను అడిగారు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి.
Read Also: SIT Telugu OTT: నేరుగా ఓటీటీలో రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?