ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మంచి చేసే వారికే మద్దతు ఇవ్వాలని, ఉన్నతమైన విలువలు, నీతి, నిజాయతీ కలిగిన నాయకులకు మీ ఆశీస్సులు అందించి ఆశీర్వదించండని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం నాడు పొదిలి మండలంలోని కుంచెపల్లి, నడింపల్లి, ఉన్నగురవాయపాలెం, దశల్లపల్లి, మల్లవరం, కొష్టాలపల్లి, మాదిరెడ్డిపాలెం ఎస్సీకాలనీ, కంభాలపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో చేసిన మంచిని వివరించి.. ప్రజల దగ్గర నుంచి సమస్యలను ఎమ్మెల్యే అన్నా రాంబాబు అడిగి తెలుసుకున్నారు.
Read Also: Rekha Jhunjhunwala: 24 గంటల్లో రూ.800 కోట్ల నష్టం.. కారణాలేంటి..?
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మంచి చేసేవారందరికీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి, చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని చెప్పారు. ఇటువంటి గొప్ప పాలనలో తాను భాగస్వామిని అయినందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. జగనన్న పాలన అంటే ఏమిటో పెత్తందారులకు అర్ధం కాదని అన్నా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు విమర్శించారు. తమ పాలనలో ఎంత మంచి జరిగిందో, ప్రజలు ఎంత మేలు పొందారో.. ఆ ఫలాలు పొందిన వారందరికీ తెలుసునని చెప్పారు.
Read Also: NEET 2024: తమ్ముడిని డాక్టర్ చేయాలని నీట్ పరీక్ష రాసిన ఎంబీబీఎస్ విద్యార్థి.. కానీ?
కాగా, రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా ఎవరిని అడిగినా జగనన్న పాలన గొప్పతనం ఏంటో తడుముకోకుండా చెబుతారని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో జరిగిన మంచిని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలనతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కావున రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ నందు “1వ” నెంబర్ పై గల ఫ్యాన్ గుర్తుకు ఓటేసి- గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా ఆయా గ్రామాల్లోని వైసీపీ నాయకులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు.