Harirama Jogaiah Letter: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. వరుసగా లేఖలు విడుదల చేస్తూ వస్తున్నారు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.. కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ అడుగులను తప్పుబట్టిన ఆయన.. మరోసారి ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో పాటు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని కూడా పిలుపునిస్తున్నారు. ఇక, తాజాగా జనసేన, తెలుగు దేశం పార్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా? అంటూ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి.. కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు హోరెత్తిస్తుంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలు చతికిలబడ్డాయని విమర్శించారు.. ఇక, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 100, జనసేన 16, బీజేపీ 5 స్థానాల్లో నెగ్గించుకోవటం ఖాయంగా కనబడుతుందన్నారు.. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మొదటి స్థానంలో పవన్ కల్యాణ్ రెండో స్థానంలో అధికార హోదాలో ఉంటారని తన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య..
Read Also: Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే?