కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా కుమారుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ తన తండ్రి కోసం పల్లె పల్లెను పలకరిస్తూ.. ప్రజలతో మమేకమౌతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ ఊరు వెళ్లినా అక్క వాళ్లు పేరుపేరునా పలకరింపులతో అతడ్ని దగ్గరకు తీసుకుంటున్నారు. ఇక, తుని మండలంలోని కొలిమేరు, N. సూరవరం, NSV నగరం గ్రామాలలో దాడిశెట్టి శంకర్ మల్లిక్ రోడ్ షో నిర్వహించారు.
Read Also: Maldives: మా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి.. మాల్దీవులు మంత్రి అభ్యర్థన
కాగా, మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన తండ్రి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ ని గెలిపించాలని ఓటర్లను శంకర్ మల్లిక్ అభ్యర్దించారు. అయితే, ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎజ్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడే దాడిశెట్టి రాజాను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక, ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.