తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోవిందా.. గోవిందా అంటూ స్పీచ్ మొదలెట్టారు. అన్నీ సర్వేలు కూటమిదే విజయం అంటోందని తెలిపారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించడం అవసరమా అని…
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ప్రధాని బహిరగసభ వేదికపై ప్రధాని నరేంద్రమోడీ తన గెలుపుకు మద్దతుగా తలపై…
RK Naidu Sagar Campaigns For Pawan Kalyan In Pithapuram : పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో ఆయనకు మద్దతుగా బరిలోకి దిగారు. ఆయన ఇంకెవరో కాదు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్. బుల్లితెరపై ఆర్కే సాగర్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొగలి రేకులు సీరియల్‌తో…
జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారంలో స్పీడ్ పెంచారు. గోకవరం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష కూటమి ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
Small Injury to Pawan Kalyan Right Leg: ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ రోజు తిరుపతిలో వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర కోసం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక రేణిగుంట విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన కుడి కాలి బొటనవేలుకి కట్టు కనిపిస్తోంది. అయితే అసలు కాలికి ఏమైంది? అనే విషయం మీద పూర్తిస్థాయిలో అవగాహన…
విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళుగా పేదలపై భారం మోపుతూ.. బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు.. రెండు వందలు వస్తున్న కరెంట్ బిల్లు వెయ్యి దాటి రెండువేల వరకు వెళ్ళిందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు ధరకు ఆఖరికి చెత్త పన్ను వేశాడని సీఎం జగన్ పై దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక…
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పేదల వైపు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల వైపు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి జగన్కు నష్టం చేయాలని చూస్తున్నాయని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్…
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే…
మంత్రి ఆర్కే రోజా.. మరోసారి నగరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెబల్స్ ఆమెకు తలనొప్పిగా మారారు.. అయితే, రెబల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారన్న ఆమె.. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు.