ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యంలో సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్చూచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేయకపోతే నిలదీయండి అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఉదయగిరి మండల కేంద్రంలో ఉదయగిరి బీజేపీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకర్ల సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.…
బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు కూటమి మొన్నటి వరకు బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది.. పేద బీసీ వ్యక్తిని కాదని బీజేపీ నుంచి ధనికుడికి ఇపుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నపుడు కూడా పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదు అని ప్రకటించానన్నారు. పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదని టీడీపీలో ఉన్నపుడు కూడా చెప్పానని తెలిపారు.