రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMSను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది.. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే…
వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ…
మన అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాలను ఓట్ల కోసమే గత పాలకులు చూశారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడిన ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను 50 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశానని.. అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని…
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీల అధ్యక్షులంతా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మే 13న జరుగనున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనం మద్ధతు కోరబోతున్నారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పారు. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా కలిసి పనిచేసి.. విజయం సాధిద్దామని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం అధ్యక్షతన మండలం క్లస్టర్ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వెంకటాద్రి నేతృత్వంలో 5 మంది యూనిట్ ఇన్చార్జీలు 47మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.
విజయవాడ వెస్ట్ నుంచి తాను పోటీ చేయడం ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఆ విషయం తాను మీడియాలో చూసినట్లు చెప్పారు. ఒకవేళ అధిష్టానం అవకాశమిస్తే.. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. రేపు సాయంత్రం కల్లా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీలో ఎవ్వరికీ ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్, అరుణ్ సింగ్ హాజరయ్యారు. ఇక, తాజాగా బీజేపీ సీటు దక్కించుకున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.. అయితే, బీజీపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా ఈ కీలక…